వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే , టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కార్యాలయం ద్వారా నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి విజితా రెడ్డి, సర్పంచ్ భూపతిరెడ్డి , వెంకటేశ్వర్ రావు ,మాజీ ఎంపిపి జయా ప్రకాష్ , నాయకులు గోపాల్ నాయక్, నాగులు నాయక్, భీమయ్య గౌడ్ , నర్సింహ తదితరులు పాల్గొన్నారు.