నిజామాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే 

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 38,43 డివిజన్ లలో పలు అభివృద్ధి పనులను భూమి పూజ చేసి శుక్రవారం ప్రారంభించారు. 38వ డివిజన్ లో కోటి రూ.లతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్డు మరియు డ్రైనేజి పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. 43వ డివిజన్ లో 1కోటి రూ లతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్డు  డ్రైనేజి పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. 43వ డివిజన్ పంచాయితీరాజ్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలోని ప్రతి డివిజన్ కి అభివృద్ధి పనులకు కోటి రూ.లు మంజూరు చేసాము. నగరంలోని ప్రతి డివిజన్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కొరకు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజి వల్ల మరమ్మతులకు గురైనా రోడ్ల నిర్మాణం కోసం టియుఎఫ్ఐడిసి ద్వారా 63 కోట్ల రూ.నిధులు మంజూరు చేసాము.థానిక కార్పొరేటర్ ద్వారా సమస్యలను పనులను ప్రారంభిస్తున్నాము.ర్టీలకు అతీతంగా ప్రతి డివిజన్ కి నిధులు మంజూరు చేసాము.ధ్యమైనంత త్వరలో ఈ పనులను పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులో కి తెస్తాము. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు గడుగు రోహిత్, గోపిడి స్రవంతి రెడ్డి, కో అప్షన్ సభ్యులు దారం సాయిలు, టీఆర్ఎస్ నాయకులు గదేపాక సహదేవ్, ఎర్రం గంగాధర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.