
అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి పరిధిలోని నరసన్నపల్లి వద్ద గల అటవీశఖ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీశాఖ కార్యాలయావరణంలో మొక్కలు నాటారు. అడవిలో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ జిల్లా అధికారి నికిత, డివిజన్ అధికారి రామకృష్ణ, కామారెడ్డిరేంజ్ అధికారి రమేష్, దివ్య, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు ఆకుల రూప రవి కుమార్, శ్రీకాంత్, నరేందర్, శ్రీనివాస్, అట విశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.