అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ చేతుల మీదుగా ఆభివృద్ది పనులను ప్రారంబించడం జర్గింది. ఈ సంధర్భంగా శుక్రవారం  మైబాపూర్ గ్రామములో అంగన్వాడీ భవనం ,గ్రామ పంచాయతి భవనం , మురికి కాలువల నిర్మాణం కోరకు ముప్పైఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి    భూమీ పూజ చేయడం జర్గింది. అధేవిధంగా లొంగన్ గ్రామములో నాలుగు లక్షలతో డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయడం జర్గింది. సిద్దాపూర్ గ్రామములో పది లక్షలతో సీసీ రోడ్డు పనులకు నిధులు వెచ్చించి పనులను ప్రారంబించారు. ఈ కాక్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గోన్నారు.