నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని తిరుమల హాస్పిటల్‌లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన యూరాలజిస్ట్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లకుండా కిడ్నీ జబ్బులతో పాటు అనేక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి ఆపరేషన్ ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నందుకు డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆకస్మికంగా వచ్చే జబ్బులతో ఏ అర్థరాత్రి గాని అపరాత్రి గాని హాస్పిటల్‌కి వస్తే వారిని కాదనకుండా వైద్యం అందిస్తు వారి ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ ప్రమీల శ్రీపతిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా తల సేమియా డయాలసిస్, అలాగే కిడ్నీ డయాలసిస్, ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నట్టు తెలిపారు. ఆపరేషన్ లేకుండా రాళ్లను హోల్ ద్వారా తీయవచ్చు అని, కిడ్నీలో రాళ్లకు లేజర్ చికిత్స ఆపరేషన్ చేయబడును అని, పోస్ట్రీట్ సమస్యలకు వైద్యం చేయబడును అని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 9603366200 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే.కిషోర్ కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, డాక్టర్ కే.సందీప్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.