నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని మల్లారెడ్డి చెరువును మినీ ట్యాంకు బాండ్ గా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా గురువారం మల్లారెడ్డి చెరువు కట్ట వద్ద జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, బీఆర్ఎస్ నాయకులు కాందేశ్ శ్రీనివాస్ ,పండిత్ పవన్ బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ మాజీ వైస్ చైర్మన్ లింగాగౌడ్, పోలా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.