నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఆందోల్ మైసమ్మ ఆలయాన్ని సందర్శించి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థంకు విచ్చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించే సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి వెళ్లారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ డిసిసిబి మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ నేత యువజన కాంగ్రెస్ నాయకుడు పెద్దగోని రమేష్ గౌడ్ ఆందోల్ మైసమ్మ వారి దర్శనం చేసుకున్నా వారిలో ఉన్నారు .