
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన పశు వైద్య డాక్టర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బండి వార్ విజయ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో చికిత్సలు పొందుతున్నారు. బండి వార్ విజయ్ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి ఆయన డాక్టరే కాకుండా ప్రజలకు అనేక రకాల స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించే వ్యక్తి. అలాంటి వ్యక్తి అనారోగ్యానికి గురికావడం మద్నూర్ గ్రామ ప్రజల్లో కలత వేసింది ప్రస్తుతం ఆయన అనారోగ్యం నుండి కోలుకొని నాందేడ్ లోనే ఆయన ఇంటి వద్ద ఉంటున్నారు. డాక్టర్ను పరామర్శించేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు బుధవారం రాత్రి నాందేడ్ సందర్శించి ఆయనను పరామర్శించారు. ఆరోగ్యస్థితి గతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట జుక్కల్ మండల నాయకులు వినోద్ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ ఎమ్మెల్యే ప్రత్యేక పిఏలు తదితరులు ఉన్నారు.