ఎమ్మెల్సీ బోలింగ్ కి ఎమ్మెల్యే వికెట్ ఔట్

నవతెలంగాణ – మాక్లూర్ 

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ వేసిన బొలింగ్ కి అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త మొదటి బాల్ కే ఔట్ అయ్యారు. మరో బల్ కి షాట్ కొట్టారు. అదే ఎమ్మెల్యే వేసిన బాల్ కి ఎమ్మెల్సీ మొదటి బల్ కి షాట్ కొట్టడంతో తనకి అడిన అనుభవం ఉందని తెలిపారు. వీరు అడిన అటను స్థానికులు తిలకించారు. మండలంలోని బోర్గం (కే) గ్రామ శివారులోని 63వ జాతీయ రహదారి ప్రక్కన గల హంగ్రిల్ల హోటల్ లో స్పోర్ట్స్ క్లబ్ ను ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ సోమవారం ప్రారంభించారు. వారు హాకీ, క్రికెట్ ప్లే గ్రౌండ్ లను ప్రారంభించి, అటను కొద్దిసేపు అడి అలరించారు. స్పోర్ట్స్ క్లబ్ దిగ్విజయంగా కొనసాగించాలని కోరారు. ఇందులో బ్యాట్ మింటన్, క్రికెట్, హాకీ, స్నొకర్, టేబుల్ టెన్నిస్ లాంటి అటలకు అవకాశం ఉందని యాజమాన్యం తెలిపారు. ఆటలతో పాటు పుడ్ సెక్షన్ కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ కంటాజి రాజేశ్వర్, నాయకులు నరేందర్ గౌడ్, హోటల్ యజమాని అశోక్ గౌడ్, నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.