ఉప్పునుంతల మండలంలోని దేవదారి కుంట తండాలో ఈ నెల 2 వ తేది నుంచి ప్రారంభించిన అచ్చంపేట విలేజ్ ప్రీమియర్ లీగ్ 3, సి వి కె ఎ పిపిఎల్, క్రికెట్ టౌర్నమెంట్ నిర్వహించారు. ముగింపు రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మ్యాచ్ లో గెలుపొందిన విజేతలకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… యువత క్రీడలో పాల్గొని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెంపొందుతాయని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు గెలుపు కోసం కృషి చేయాలన్నారు. క్రీడలతో చెడు అలవాట్లకు దూరమవుతారని, యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలన్నారు. ఫైనల్ మ్యాచ్ భీమ్ వారియర్స్ జట్టు, ఆర్ ఆర్ వారియర్స్ జట్టు తలపడగా భీమ్ వారియర్స్ జట్టు విజయం సాధించారు. విజేతలకు మొదటి బహుమతి ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి అందజేయగా, ద్వితీయ బహుమతి బొజ్జ అమరేందర్ రెడ్డి (ఎన్నారై) సహకారంతో విజేతలకు అందజేశారు. అదేవిధంగా మొదటి, రెండవ షీల్డ్ కప్పు ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దాత యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లయ్య సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, తిప్పర్తి నరసింహారెడ్డి, సీనియర్ న్యాయవాది రాజేందర్, వైస్ ఎంపీపీ వెంకటేష్, ఉప్పునుంతల మాజీ సర్పంచు బాన్యానాయక్, రేణయ్య, దేవదారి కుంట తండా ఉపసర్పంచ్ జైపాల్, క్రికెట్ టౌర్నమెంట్ నిర్వాహకులు గోవింద్ సింగ్, రతన్ సింగ్, రాత్లావత్ కృష్ణ, రమేష్, మతృ, రాందాస్, క్రీడాకారులు అభిమానులు పాల్గొన్నారు.