అగ్ని ప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే జారే ఆర్ధిక సహాయం

నవతెలంగాణ – అశ్వారావుపేట 
మండలంలోని కుడుములపాడు గ్రామంలో  అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. అగ్ని ప్రమాదం లో శరీరం కాలిన 7 సంవత్సరాల చిన్నారి పూనేం మీనాక్షి కి పరామర్శించారు. స్థానిక రిపోర్టర్,ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు సంకురాత్రి సతీష్ ఆధ్వర్యంలో దాతల నుండి సేకరించిన విరాళం రూ. 32 వేల కు మరో రూ.10 వేలు కలిపి మొత్తం రూ. 42 వేల ను బాధితులు పూనేం మీనాక్షి కుటుంబానికి వైద్య ఖర్చులు నిమిత్తం అందచేశారు. తక్షణమే ఖమ్మం హాస్పిటల్ వెళ్ళటానికి అంబులెన్స్ ఏర్పాటు చేసారు. బాలిక సహాయర్ధం 32 వేల రూపాయలు సేకరించిన సంకురాత్రి సతీష్ ను అభినందించగారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఇల్లు మంజూరి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు జూపల్లి రమేష్,పార్టీ కార్యకర్తలు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.