క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే జారే…

– మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారంవారిగూడెం సమీపంలో జరిగిన ప్రమాద క్షతగాత్రులను శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరామర్శించారు. గుమ్మడి వల్లి కి చెందిన కూలీలు నర్సరీ పనుల నిమిత్తం అశ్వారావుపేట నుండి నారం వారి గూడెం వైపు ట్రాక్టర్ లో మామిడి మొక్కల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెంది పలువురు తీవ్రగాయాలు పాలవడంతో అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి  తరలించగా అక్కడకు వెంటనే చేరుకొని బాధిత కుటుంబాలను ఓదార్చి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం పలువురిని ఖమ్మం, కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు దగ్గరుండి పంపించారు. అలాగే వివిధ అనారోగ్య  సమస్యలతో జనరల్ వార్డ్ లో ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్లు ను పరామర్శించి హాస్పిటల్ వైద్యులు ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటూ హాస్పిటల్లో వసతులను పరిశీలించి వారికి పలు సూచనలు చేసారు. ఆయన వెంట నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు తదితరులు ఉన్నారు.