ఉచిత బిల్లు, పోలియో చుక్కల కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఆదివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హడావుడీ చేసారు.అశ్వారావుపేట ఆరోగ్య ఉప కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించిన అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో కలియ తిరిగారు.ఎమ్మెల్యే అయ్యాక బస్టాండ్ ను సందర్శించడం ఇది నాలుగోసారి.ఈ సందర్భంగా బస్టాండ్ క్యాంటీన్ అపరిశుభ్రత పై ఆగ్రహం వ్యక్తం చేసారు.మళ్ళీ సారి వచ్చే సరికి ఇలానే ఉంటే బాగోదని హెచ్చరించారు.పాపిడి గూడెం లో ఒక శుభకార్యానికి హాజరు అయ్యారు.వినాయకపురం లో గృహ జ్యోతి పధకంలో ఉచిత విద్యుత్ బిల్లులను లాంచనంగా ప్రారంభించి తానే స్వయంగా విద్యుత్ బిల్లులు తీసారు.వినాయకపురం పి హెచ్ సి లో పల్స్ పోలియో చుక్కలు వేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాం దాస్,విద్యుత్ శాఖ ఎల్.ఐ రామక్రిష్ణ,పి.ఎ.సి.ఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,పేరాయిగూడెం ఎం.పి.టి.సి మిండ హరిక్రిష్ణ,నాయకులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,జూపల్లి ప్రమోద్,దండాబత్తుల నరేష్ లు పాల్గొన్నారు.