నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయం తో పాటు అడవులు పెంపుదల ముఖ్యమే నని, జీవ జాతి ఉనికి అడవి లోనే మన గలిగింది అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో అటవీశాఖ ఆద్వర్యం లో పాపిడి గూడెం లో బుధవారం నిర్వహించిన 75 వ వన మహోత్సవాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు సమృద్ధి గా పెరిగితేనే పర్యావరణం సమతుల్యత ఏర్పడి జీవకోటికి ప్రాణవాయువు అందుతుందని కాబట్టి అడవులు నరికి కొత్త పోడు పేరుతో వాతావరణం శిధిలం చేయవద్దని పిలుపు నిచ్చారు.అనంతరం ఆయన మొక్కపాటి,పచ్చని చెట్టును నేను…అంటూ జయరాజు గీతాన్ని ఆలపించి సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఎఫ్.డి.ఓ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ 15 హెక్టార్ లలో నూతనంగా మొక్కులు నాటుతున్నాం అని తెలిపారు. నాటడానికి తెచ్చిన 20 జాతుల మొక్కల వివరాలు పై విద్యార్ధులకు క్విజ్ నిర్వహించగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తేజస్విని అత్యధిక ప్రతిభ కనబరిచింది.దీంతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆ పాపకు రూ.1,116 లు పారితోషికంగా అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఆర్.ఒ మురళీ,ఎఫ్.బి.ఒ నరేష్,ఎంపిటిసి భారతి, కాంగ్రెస్ నాయకులు చెన్నకేశవ రావు,తుమ్మ రాంబాబు తదితరులు పాల్గోన్నారు.