రేపు మండలానికి ఎమ్మెల్యే రాక..

MLA's arrival in Mandal tomorrow..– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ 
నవతెలంగాణ – పెద్దవంగర
రేపు మండల కేంద్రంలోని రైతు వేదిక లో జరిగే కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తెలిపారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేయనున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు కానున్నారని పేర్కొన్నారు. అధికారులు, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.