నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పుట్టిన రోజు వేడుకలను సోమవారం పార్టీ శ్రేణులు,అభిమానులు నియోజక వర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో నాయకులు జూపల్లి రమేష్ నేతృత్వం లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.వృద్ధులే స్వయంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనే స్వయంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసారు. విందు ఏర్పాటు చేసారు. ఆశ్రమం నిర్వాహకురాలు అనసూయ కు ఆర్ధిక పారితోషికం అందజేసారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి వీరభద్రరావు,తుమ్మ రాంబాబు,జూపల్లి ప్రమోద్,మిండ హరిక్రిష్ణ జూపల్లి రమేష్ అనుచర వర్గం పాల్గొన్నారు.