
– ముందు కొనసాగిన ఎమ్మెల్యేలు ఫోన్ లేపని పరిస్థితి
– పార్టీలకు అతీతంగా కృషి చేయడం అభివృద్ధికి పాటుపడడం ప్రజల్లో ఆనందం హర్షం
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గానికి ఎందరో ఎమ్మెల్యేలు గెలుపొందారు వెళ్లిపోయారు. కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండకపోవడం ప్రజా సమస్యలకు పట్టించుకోకపోవడం అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేయడం ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యేలలో చూసిన పనితీరు ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. జుక్కల్ ఎమ్మెల్యేగా విద్యావంతుడు గెలుపొందడం ప్రజా సమస్యల పట్ల ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పట్ల పట్టుదలతో ముందుకెళ్లడం పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కరించడం ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు వంటి నాయకుడిని చూడడం ఇదే మొదటిసారి అంటూ నియోజకవర్గం ప్రజల్లో ఆనందం హర్షం వ్యక్తం అవుతుంది. ఇంతవరకు పని చేసిన ఎమ్మెల్యేలు ఏదైనా ఆపదశాపద వస్తే ఫోన్ చేసినా లేపే వారే కాదు ఇప్పుడు లక్ష్మి కాంత్ హాయంలో ఎప్పుడు ఫోన్ చేసినా ఎలాంటి వారి ఫోన్ వచ్చిన దానిని స్వీకరించడం సమస్యను అడిగి తెలుసుకోవడం వారి సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు మాట్లాడడం ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు పని తీరు పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. వెనుకబడ్డ ప్రాంత జుక్కుల అభివృద్ధికి నిధుల కోసం పట్టుదలతో అభివృద్ధి పనులు సాధించడం విద్యావంతులై ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ప్రాంత అభివృద్ధికి ఎంతగానో మేలు జరుగుతుందని నియోజకవర్గం ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.