నీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యే చొరవ…

– బోరు నిర్మాణానికి నిధులు కేటాయింపు…
– పనులు ప్రారంభం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తరచూ తాగునీటి సమస్యతో ఇబ్బంది పడే కొత్తూరు గ్రామస్థుల నీటి కష్టాలు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో తీరుతున్నాయి.గ్రామంలో నీటి సమస్యను నివారణకు సోమవారం బోరు వేశారు. ఆ గ్రామంలో నీటి సమస్యను పరిష్కారం చేయాలని ఈ నెల 2 వ తేదీ గ్రామస్థులు రోడ్డుపై బైటాయించి ఆరు గంటలకు పైగా ఆందోళనకు దిగిన సంగతి తెల్సిందే.దీంతో గ్రామంలో తాగునీటి సమస్య తొలగించేందుకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన కోటా నిధులు రూ.4.5లక్షలు కేటాయించారు.ఈ నిధులతో బోరు, విద్యుత్తు మోటారు ఏర్పాటు చేసి గ్రామంలో ఇప్పటికే ఉన్న పైపులైన్ కు అనుసంధానం చేయనున్నట్లు మిషన్ భగీరథ ఇంట్రా డీ ఈ సలీం తెలిపారు.