ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలి

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామంలో సోమవారం జరిగే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పర్యటన విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గోవర్ధన్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నట్లు, అనంతరం హరిత దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని ఆమె కోరారు.