
మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నేడు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పలు అభివృద్ధి పనులు ప్రారంభించి గ్రామపంచాయతీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్నట్లు సోమవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బిక్కాజి బలవంతరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.