ప్రగతి యాత్రలో భాగంగా జీడిమెట్ల డివిజన్‌లో ఎమ్మెల్యే పర్యటన

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
జీడిమెట్ల 132 డివిజన్‌ పరిధిలోని వెన్నెలగడ్డ , బౌద్ధ నగర్‌ లలో ప్రగతి యాత్రలో భాగంగా 68వ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా తమ బస్తీల్లో కాలనీలలో మెరుగైన సౌకర్యల కల్పనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు, ఎమ్మెల్యేకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంచినీటి సరఫరలో అంతరాయం లేకుండా చూడాలని అక్కడక్కడ మిగిలి ఉన్న భూగర్భ డ్రయినేజీ, సీసీ రోడ్ల ఏర్పాటు పార్క్‌ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేని కోరగా అక్కడే ఉన్న అధికారులకు ఆయన ఆదేశించారు త్వరలోనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్‌ నాయకులు సంపత్‌ మాధవరెడ్డి, కుంట సిద్ధి రాములు , గుమ్మడి మధుసూదన్‌ రాజు, జ్ఞానేశ్వర్‌ , వార్డు సభ్యులు సుధాకర్‌ గౌడ్‌, ఇందిరారెడ్డి ,కాలే నాగేష్‌, సమ్మయ్య, బాలేష్‌, బిక్షపతి , రవి , యాదగిరి, సుబ్బారావు, మధు, కృష్ణ, ముత్యం రెడ్డి, చక్రవర్తి పాల్గొన్నారు.