నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ డోంగ్లి మండలాల్లోని పలు గ్రామాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మంగళవారం నాడు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆన్లైన్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా డోంగ్లీ మండలం ధోతి గ్రామం గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 26 నుండి ప్రభుత్వం అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అనంతరం డోంగ్లీ మండల కేంద్రంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మొఘ గ్రామంలో ధ్రువ ఆన్లైన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మద్నూర్ ఎఎంసి చైర్మన్ సౌజన్య రమేష్ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మద్నూర్ డోంగ్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు, రాజు పటేల్ డోంగ్లి మండల తాసిల్దార్ రేణుక చౌహన్ నాయకులు శివాజీ పటేల్ దీన్ దయాల్ వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.