కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు..

MLAs met Union Minister of State for Home Affairs.నవతెలంగాణ – ముధోల్
హైదరాబాదులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని ఆయన నివాసంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ లు కలిశారు. ఈసందర్భంగా హోంమంత్రితో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ముదోల్, ఆదిలాబాద్, పార్టీ స్థితిగతులపై మంత్రి చర్చించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాసర లో సరస్వతి అమ్మవారి ఆలయంలో జరగనున్న వసంత పంచమి ఉత్సవాలకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వస్తాను, ఒకవేళ వీలుకాని పక్షంలో మరోసారి బాసరకు వస్తానని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా అమ్మవారి ఆలయానికి ప్రసాదం స్కీంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీనిఇచ్చారు. వీరి వెంట బిజెపి యువ నాయకులు పట్టేపురం సతీష్ రెడ్డి ఉన్నారు.