భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి మరొకసారి అవకాశం కల్పించాలని కోరుతూ.. అభివృద్ధిని చూసి ఓటేయాలని ఎమ్మెల్యే సతీమణి పైల వనిత శేఖర్ రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని హన్మాపురం, మన్నె వారి పంపు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. భువనగిరి ప్రజలకు ఎల్లప్పుడూ.. అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా శ్రేయసేదేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జడ్పిటిసి సుబ్బులు బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్, మన్నె వారి పంపు సర్పంచ్ బోయిని పాండు, ఉప సర్పంచ్ భానుచందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అతికము లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నాయకులు నాగపురి కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు దేవేందర్, టిఆర్ఎస్ నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.