– మాడ్గులపల్లి మండలం చర్లగూడెంలో అంత్యక్రియలు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ,ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తల్లి అలుగుబెల్లి భాగ్యమ్మ గురువారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చర్లగూడెంలోని ఆమె నివాసంలో మతి చెందారు. భాగ్యమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భాగ్యమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పెద్దకుమారుడు. ఆమె భౌతిక కాయానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, డీజీ నర్సింహారావు, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు జంగయ్య, ఉపాధ్యక్షులు సిహెచ్. రాములు, కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, నాగమణి , వీఓటీటీ సంపాదకులు మాణిక్‌రెడ్డి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. వీరి వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డిసుధాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు బొంతలచంద్రారెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు ఉన్నారు.