నీట్‌ అక్రమాలపై పోరాడుతాం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ వేదికగా నీట్‌ అక్రమాలపై పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గురుకుల, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కొంత మంది రాజకీయంగా లబ్దిపొందేందుకు విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వారికి ఇబ్బందులుంటే తమను సంప్రదించాలని సూచించారు. పదిహేను రోజుల్లో వారి సమస్య పరిష్కరిస్తామన్నారు. సీఎంపై బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమంటూ నిరూపిస్తే తాను బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు.