పట్టణంలో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ ర్యాలీ

నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి శనివారం భారీ ర్యాలీ నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితమే  నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేసినట్టు, బి ఫాం తీసుకున్న తర్వాత పట్టణ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆర్మూర్లో ర్యాలీ కొనసాగడం శుభసూచకమని అన్నారు. పట్టభద్రుల సమ్మేళనం అద్భుతంగా జరిగింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ గెలుపు ఒక బహుమతి కావాలని , ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రభుత్వం బలోపేతం చేసిందని , వచ్చే సోమవారం 10వ తేదీన నామినేషన్ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  పాటు మంత్రులు సైతం హాజరవుతున్నారని, రాబోయే  స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. ఈ సందర్భంగా  స్థానిక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార చంద్రమోహన్ అయ్యప్ప శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో  ఎంతోమంది ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.  భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.