నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో పీఆర్టీయూ టీఎస్ బలపరిచిన అభ్యర్థి మహేందర్ రెడ్డిని గెలిపించేల ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్ కోరారు. ఆదివారం పీఆర్టీయూ భవనంలో సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ… మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో సంఘం నిలబెట్టిన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు. గతంలోని ఓటరు లిస్టు రద్దవుతుందన్నారు. మూడు సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా ఉన్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నంబర్ 6వ తేది వరకు సమయం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు తమను సంప్రదిస్తే ఓటరుగా నమోదు చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమస్యలు అనేకంగా ఉన్నాయని వాటిపై సంఘం ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.