– సాయంత్రం 4 గంటల వరకు 68.65 శాతం పోలింగ్
– బ్యాలెట్ బాక్స్‌ల్లో నేతల భవితవ్యం
– జూన్ 5న ఫలితం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటల వరకు 68.65 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ వరుసలో ఉన్న వారికి ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. వారి ఓటింగ్ పూర్తయితే పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 11 గంటల నుంచి ఊపందుకుంది. మొదటి రెండు గంటల్లో 11.34 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాత వేగం పుంజుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 29.30 శాతం, మధ్యాహ్నం 2 గంటలకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం భారీ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్స్‌లను నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. వారితో పాటు 39 మంది ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటల వరకు 68.65 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఎన్నిక ఫలితాన్ని జూన్ 5వ తేదీన వెల్లడించనున్నారు.