నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత క్షమాపణ చెప్పాలి

నవతెలంగాణ – ఆర్మూర్
ఏమ్యేల్సి కవిత నియోజకవర్గ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఆర్మూర్ నియోజక వర్గ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజక వర్గంలోనీ మాక్లుర్ మండల BRS కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్సీ కవిత ఆర్మూర్ ఎమ్మెల్యే నీ ఉద్దేశించి మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి పై ఆర్మూర్ నియోజక వర్గంలో పోటీ చేయాలంటే (అమ్మోరు తల్లి ముందు మేక పిల్లను నిలబెట్టినట్టు) వుంటుందనిమాట్లాడిన తీరు సరైంది కాదని తక్షణమే అమే మాటలను వెనకకు తీసుకుని నియోజక వర్గ ప్రజలకు క్షమపన చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలు సమక్యంద్ర నాయకుల మేడలు వంచి ఎన్నో కేసులు. జైళ్లు.లాటి దెబ్బలు. ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో నిర్బందలను లెక్క చేయకుండా రాష్ట్రాన్ని తెచ్చుకున్నారని గుర్తు రాష్ట్రం వచ్చాక కల్వకుంట్ల కుటుంబం వల్లనే రాష్ట్రాన్ని సాధించి పెట్టమని మోసపూరిత మాటలు మానుకోవాలని అయన అన్నారు .నిజమాబాద్ జిల్లా ప్రజలు మహిళ నాయకురాలిగా గౌరవించి ఎంపీ గా గెల్పించుకుంటే ఒక ముఖ్యమంత్రి కుతురై జిల్లా మాజీ ఎంపీ గా కొనసాగుతున్న mlc హోదాలో ఉన్న కవిత ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఎన్నికలకు ముందే బయబ్రంతులకు గురి చేసే విధంగా మాట్లాడడం సరైన పద్దతి కాదని తక్షణమే కవిత ఆర్మూర్ నియోజక వర్గ ప్రజలకు క్షమపన చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.