
నవతెలంగాణ – కంఠేశ్వర్
పసుపు బోర్డు ఏర్పాట్లు ఎమ్మెల్సీ కవిత కృషి ఎవరు కాదనలేని సత్యం అని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు స్వాగతిస్తునామని తెలిపి పసుపు పంటకు మద్దతు ధర, పసుపు దిగుమతులను కట్టడి చేసే విధంగా కృషి చేయాలనీ చేసి సూచనను పసుపు బోర్డు ఏర్పాటుకు తాను చేసిన కృషిని చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. కొద్ది మంది నాయకులు వారి స్థాయి మరచి పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దవాళం అవుతామని భ్రమ పడుతున్నారని అన్నారు. కవిత పసుపు బోర్డు ఏర్పాటు ఎన్నో సార్లు ప్రధాన మంత్రిని 5రాష్ట్రల ముఖ్యమంత్రులను కలిసి వినతులు అందించారని పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన పసుపు బోర్డు అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారన్న విషయాన్నీ తెలుసుకోవాలని సూచించారు. కవిత పసుపు రైతుల సమస్యలపై చేసిన పోరాటానికి పార్లమెంట్ వేదికగా లేవనేత్తిన అంశాలకు గాను ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు సైతం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్నీ తెలుసుకొని మాట్లాడాలని హితావు పలికారు.కవిత పై అవాకులు చేవకులు మాట్లాడితే తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. ఈ రోజు ఎవరో చెపితే ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు మీ ఎంపీ అరవింద్ ని పసుపు బోర్డు గొప్పదా లేక టర్మారిక్ ఎక్సటెన్షన్ సెంటర్ గొప్పదో ప్రశించాలని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కవిత ఎనలేని కృషి చేసారని ప్రస్తుత ఎంపీ అరవింద్ 5రోజుల్లో తెస్తానన్నా పసుపు బోర్డు కు 5సంవత్సరాల కాలయాపన తరువాత రాజకీయ లబ్ది కోసమే బోర్డు ప్రకటన చేసారని ఎందుకు బహిరంగ ప్రారంభ వేడుకలు నిర్వహించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ గారితో కలిసి మాజీ జడ్పి వైస్ ఛైర్మెన్ సుమన రెడ్డి మాజీ కార్పొరేటర్లు విశాలిని రెడ్డి, సిర్ప సువర్ణ, పార్టీ కార్మిక విభాగం ఆధ్యక్షురాలు విజయలక్ష్మి, పార్టీ నగర మహిళా ఆధ్యక్షురాలు గంగామణి, నాయకులు పంచరెడ్డి అనిత, తదితరులు పాల్గొన్నారు.