బెడుదురి నాగలక్ష్మికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి

నవతెలంగాణ -పెద్దవూర: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం మదారి గూడెం గ్రామానికి చెందిన సీనియర్ బిఆర్ ఎస్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బెడుదురి వెంకట్ రెడ్డి సతీమణి నాగలక్ష్మి సోమవారం తెల్లవారుజామున అనారోగ్యం తో మరణించారు. వారి నివాసంలో ఉమ్మడి జిల్లా ఎంఎల్ సి ఎంసి కోటిరెడ్డి సందర్శించి,పులా మాలలు వేసి, నివాళులు అర్పించచారు. నాగలక్ష్మి మృతి పట్ల శాసన మండలి సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆకాల మరణం పట్ల వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అనుముల మండల ఎంపీపీ సుమతీపురుషోత్తం, తిరుమలగిరి(సాగర్)యం.పి.పి భగవాన్ నాయక్, మాజీ ఎంపీపీ అల్లిపెద్ది రాజు యాదవ్,పెద్దగూడెం సర్పంచ్ మల్లారెడ్డి, హాలియా బిఆర్ యస్ పట్టణ అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి, జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ హలీం, హజరి గూడెం ఉప సర్పంచ్ జలీల్, మండల ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ జానీ, కున్ రెడ్డి కృష్ణ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పోశం శ్రీనివాస్ గౌడ్, ఆవుల శ్రీనివాస్ యాదవ్, సి.కె యూత్ అధ్యక్షులు బండి రమేష్, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు మద్ది మడుగు మార్క్ తదితరులు పరామర్శించారు.