పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి

నవతెలంగాణ-నిడమనూరు
పల్లెలు అభివృద్ది చెందినప్పుడు దేశం అభివద్ధి చెందుతుందని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఉట్కూరు గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు దశాబ్ది వేడుకల సందర్భంగా సపాయి కార్మికులకు సామాగ్రి అందించి ప్రశంస పత్రాలను అందజేశారు. ఇశ్రం విజయకు మంజూరైన రూ.20 వేల చెక్కునూ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అన్నీ రాష్టలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింగ్‌ విజరుకుమార్‌, మాజీ ఎంపీటీసి కేశాబోయిన జానయ్యగౌడ్‌, మెరెడ్డి సత్యనారాయణరెడ్డి, పాములురి నర్సింహాచారి తదితులు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధికి ఎనలేని కృషి
-ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ రూరల్‌ : తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల సమగ్ర అభివద్ధికి సీఎం కేసీఆర్‌ ఎనలేని కషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌ నగర్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో ఆయన జిల్లా కలెక్టర్‌ వినరు కష్ణారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణలోని పల్లెలు అభివద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గ్రామాల అభివద్ధికి సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగిందన్నారు. దీంతో ప్రతి గ్రామంలోని ఇంటింటికి తాగునీరు, అంతర్గత రోడ్లు, స్మశాన వాటికలు, పల్లె ప్రకతి వనాలు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ రాకముందు గ్రామాల్లో కరెంటు కోతలతో ప్రజలు రైతులు నానా ఇబ్బందులు పడే వారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో వ్యవహరించడం పట్ల ప్రజలకు, రైతులకు నేడు 24 గంటల విద్యుత్తు అందుతుందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన శ్రీనివాస్‌ నగర్‌ గ్రామ అభివద్ధిలో ముందంజలో ఉందని తెలిపారు. గ్రామ సమగ్ర అభివద్ధి కోసం తను కషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాలను అన్ని రకాలుగా అభివద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్‌ వినరు కష్ణారెడ్డి మాట్లాడుతూ పల్లెల సమగ్ర అభివద్ధి కోసం సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కషి చేసి గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈనెల 19 న నిర్వహించే హరితోత్సవం కార్యక్రమానికి అధికారులు, ప్రజలు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. స్థానిక సర్పంచ్‌ భోగవేల్లి వెంకటరమణచౌదరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, ఎంపీపీ నూకల సరళ హనుమంతరెడ్డి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీటీసీ సుజాత, ఉపసర్పంచ్‌ అచ్యుతరామయ్య, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో పల్లెలు దేశానికే ఆదర్శం
ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌
డిండి : తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు దేశానికే ఆదర్శం అని దేవరకొండ శాసనసభ్యులు రమావత్‌ రవీంద్ర కుమార్‌ అన్నారు. గురువారం డిండి మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని తెలిపారు. గ్రామలే దేశానికి పట్టుకోమ్మలు అనే నానుడిని వందశాతం అమలు చేసి చూపించిన గోప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్‌రావు, ఆర్డీవో గోపిరాం, రైతు బంధు అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్‌ రావు, పిఎసిఎస్‌ చైర్మన్లు తుం నాగార్జున్‌ రెడ్డి, మాధవరం శ్రీనివాస్‌ రావు, యంపిడిఓ గిరిబాబు, స్థానిక సర్పంచ్‌ మేకల సాయమ్మకాశన్న, గిరమోని శ్రీను, మేకల కాశన్న, వావిళ్ళ సలయ్య తదితరులు పాల్గొన్నారు.
చండూరు : తెలంగాణ దశాబ్దాలలో భాగంగా గురువారం గట్టుప్పల మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్‌ కుమారి ఈడం రోజా ఆధ్వర్యంలో ఘనంగా పల్లె ప్రకతి దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ నుండి సపాయన్న సలాం సపయమ్మ సలాం అంటూ ర్యాలీ ప్రారంభమై వైకుంఠధామం డంపింగ్‌ యార్డ్‌ పల్లె ప్రకతి వనం నర్సరీ క్రీడా ప్రాంగణంల ద్వారా గ్రామపంచాయతీకి చేరుకొని సర్పంచ్‌ ఇడం రోజా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు అవార్డ్‌లు అందజేసి గ్రామ పంచాయతీ సిబ్బందిని శాలువాతో సర్పంచ్‌, స్థానిక తహశీల్దార్‌ వీ.లావణ్యలచే శాలువాలతో సత్కరించారు. సిబ్బందికి యూనిఫాం, షూస్‌, గ్లౌసెస్‌, తదితరాలను అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి గ్రామంలో పల్లె ప్రకతి వనాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్‌ యార్డ్‌లు ఏర్పాటు చేసుకుని ప్రగతి పదంలో ముందుకు గ్రామాలు వెళ్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డులతో మన రాష్ట్రానికి వచ్చిన అవార్డులు నిదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గట్టుప్పల మండల సాధకుడు లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఇడం కైలాసం, వార్డ్‌ సభ్యులు శంకరయ్య, నాగమణి కార్యదర్శి షఫీ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్‌ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కడపర్తి, చందంపల్లి, నెల్లిబండ, గొల్లగూడెం, తాటికల్‌ గ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాన్ని, ట్రాక్టర్‌, టాంకర్‌లను మామిడి తోరణాలతో అలంకరించి ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అధికార చేత జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాలలో జడ్పిటిసి మాల ధనలక్ష్మి నగేష్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ గొర్ల సరిత వీరయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు నాగమణి, సరస్వతి, కొండ ప్రవీణ్‌, కోటమ్మ, రవీంద్ర చారి ప్రజలు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలో ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీలలో జాతీయ జెండాను పరిష్కరించారు. అందులో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం, హరిత దినోత్సవం ఏనుగులదోరి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఈఓ ప్రేమ్‌ చందర్‌, ఎంపిడిఓ గుండె గొని యాదగిరిగౌడ్‌, ఎంపిటిసి మేకల రాజిరెడ్డి, సర్పంచ్‌ మహేశ్వరం సతీష్‌, పంచాయతీ కార్యదర్శి వేముల అంజలి, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా జెడ్పి సిఈఓ ప్రేమ్‌ చందర్‌, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సంపద వనాన్ని ఆయన పరిశీలించారు. ఈయన వెంట ఎంపీడీవో గుండగోని యాదగిరిగౌడ్‌, ఉపాధి హామీ ఇంజనీర్‌ రాంబాబు ఉన్నారు.