నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శనివారం అసెంబ్లీ సందర్శకుల గ్యాలరీకి వచ్చారు. సాధారణ ప్రజల తరహాలో వచ్చిన ఆయన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తిలకించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు సందడి వాతావరణం నెలకొంది. నూతన సభ్యుల ప్రమాణస్వీకారం ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చారు.