పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన పెద్దవూర ఎంపిడిఓ కార్యాలయ  సబర్డినేటర్  గా పనిచేస్తున్న కూరాకుల రామలింగయ్య శనివారం ఉదయం అనారోగ్యం తో మరణించారు. పెద్దగూడెం నివాసంలో వారి పార్థివ దేహాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటిరెడ్డి సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామలింగయ్య మృతి పట్ల శాసన మండలి సభ్యులు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి,పెద్ద వూర సర్పంచ్ నడ్డి లింగయ్య, చింత పల్లి సర్పంచ్ సుంకి రెడ్డి సంజీవ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బెడుదురి వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచ్ పవన్, బి.ఆర్.యస్ నాయకులు వెంకట్ రెడ్డి, రిక్కల పెద్ద అచ్చిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.