బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ

నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం, శ్రీనాథపురం గ్రామంలోని శ్రీకృష్ణ బిపిఈడి కాలేజీ మైదానంలో  పెద్దవూర ఎంపీడీఓ దుబ్బ శ్యామ్ జ్ఞాపకార్థం పంచాయతీ సెక్రెటరీల ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.
బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా.. నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు ఏంసి కోటిరెడ్డి హాజరైగెలుపొందిన టీములకు బహుమతులు అందజేశారు.శుక్రవారం జరిగిన  ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠంగా భారీతంగా జరిగిన నిడమనూరు, పెద్దవూర జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో నిడమనూరు జట్టు విజయం వరించింది.ఈ యొక్క పోటీలలో మొదటి బహుమతి సాధించిన నిడమనూరు జట్టుకు ఎమ్మెల్సీ,జిల్లా పంచాయతీ శాఖ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దవూర ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, హుజూర్నగర్ ఎమ్మార్వో నాగార్జున రెడ్డి, దుబ్బశ్యామ్ సతీమణి మాధవి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలోరిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ రాజు,జిల్లా పంచాయతీ సెక్రెటరీ అధ్యక్షులు నిరంజన్, కార్యదర్శి ఖాసిం,డాకు నాయక్, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.