ఎమ్మెల్సీ పోచంపల్లి సుడిగాలి పర్యటన 

నవతెలంగాణ-చేర్యాల, కొమురవెళ్లి
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల,కొమురవెళ్లి మండలాల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు.కొమురవెళ్లి లో గల శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం  చేర్యాల పట్టణంలో కౌన్సిలర్ ఆడెపు నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ తో కళ్యాణి గార్డెన్ లో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోచంపల్లి తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, మల్లికార్జున స్వామి దయతో సీఎం కేసిఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ మూడవసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నకాశి చిత్రపటాన్ని కౌన్సిలర్ ఆడెపు నరేందర్ పోచంపల్లికి అందజేశారు. అనంతరం పట్టణంలోని కొమురవెల్లి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ ఆడెపు చంద్రయ్య, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ నివాసాలకు వెళ్లి వారిని పలకరించారు. ఒకవైపు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య టికెట్ రాజకీయం ముదురుతున్న నేపథ్యంలో చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి సుడిగాలి పర్యటన మరింత చర్చనీయాంశంగా మారింది.దీంతో ముగ్గురిలో అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.సమావేశంలో చేర్యాల వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డి, కౌన్సిలర్లు మంగోలు చంటి,ఆడెపు నరేందర్,ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షుడు గూడూరు బాలరాజు,ఎండీ.ఏక్బాల్,పచ్చిమడ్ల మానస తోపాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.