ఎమ్మెల్సీ ఎన్నికలను నియమ నిబంధనలు పాటించాలి…

– జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియమ నిబంధనలు  పాటించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, సెక్టార్  ఆఫీసర్స్ కు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటును ఎలా రికార్డు చేయాలో , ఓటు హక్కు వినియోగించుకునేవారి  వివరాలు ఎలా నమోదు చేయాలో, తదితర విధి విధానాలు పిపిటి ద్వారా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, సెక్టార్ ఆఫీసర్స్ కు అవగాహన కల్పించడం  జరిగిందనారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా  విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు వద్ద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని,  దానికి అనుగుణంగా ఎనిక్కల సిబ్బంది  అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా లెవల్ మానిటరింగ్ ట్రైనర్స్  కడారి నర్సిరెడ్డి , హరినాథ్ రెడ్డి,  పి. ఓ లు, ఏ. పి. ఓ లు,  ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.