
రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది అని రుణమాఫీ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామంలో రైతులతో రుణమాఫీ సంబరాల్లో పాల్గొని మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షలోపు పంటరుణాలను మాఫీ చేసింది. వ్యవసాయ శాఖ రుణమాఫీ నిధులు విడుదల కాగా.. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రంలో రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యం అన్నారు. పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం నెలన్నర రోజుల్లోనే చేసి చూపించిందని అన్నారు. రైతు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి సమక్షంలో రైతులకు ఇచ్చిన రుణ మాఫీ హమిని నిలబెట్టుకున్నాం. దేశచరిత్రలో కనీవిని ఎరుగని విధంగా అన్నదాతలకు ఏక కాలంలో రూ. రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసుకుంటున్న శుభసందర్భం ఇది. లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే రూ. లక్ష జమ కావడంతో వారంతా రుణ విముక్తులయ్యారు.
యావత్ తెలంగాణ రైతాంగం రుణ మాఫీ పండగ చేసుకుంటోందని మల్లన్న అన్నారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలేరు నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ అమలు చేస్తుందని తెలిపారు.2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25వేల చొప్పున నాలుగు విడతలుగా లక్ష రూపాయలు మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ఆగస్టు 15లోగా మిగతా లక్ష రూపాయలు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకేసారి రూ.రెండు లక్షలు రుణమాఫీ చేయడం ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేష్, ఉపాధ్యక్షులు మన్నెం నరేందర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ బాల్ నర్సయ్య, ఏవో పద్మ, ఆంజనేయులు,యువజన ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్, బొబ్బిలి నర్సిరెడ్డి, మండల అధ్యక్షులు రామిడి శ్రవణ ప్రసాద్ రెడ్డి, రాంపల్లి మహేష్ గౌడ్, రాజేష్ పైలెట్, తిరుమల కవిత వెంకటేష్, లక్ష్మీ నరసయ్య, హేమంత్ రెడ్డి,శ్రీహరి నాయక్, మేడిపల్లి గ్రామ శాఖ సుర్వి బిక్షపతి గౌడ్, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంత్ ముదిరాజ్, నేలుట్ల వెంకటేష్, నాగరాజ్, సిద్ధిగోని సుదర్శన్ గౌడ్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.