ఆధ్యాతిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Spiritual knowledge should be developed: MLC Theenmar Mallanna

నవతెలంగాణ – బొమ్మలరామారం

ప్రతి ఒక్కరు ఆధ్యాతిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రామలింగపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహం, నాభిశీల ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.అనంతరం గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు దేవాలయంలో తీన్మార్ మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గ్రామాల్లోని దేవాలయ ఉత్సవాల్లో యువకులు, ప్రజలు పార్టీలకు అతీతంగా కలసికట్టుగా నిర్వహించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, ఉపాధ్యక్షులు మన్నెం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి,మాజీ ఎంపిటిసి హేమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ యంజాల కళ, మర్యాల మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ, నాయకులు రామ్ రెడ్డి,రాజు నాయక్, గోపాల్ రెడ్డి సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.