మల్హర్ లో ఎమ్మెల్సీ ఓటర్లు 566

– మార్చి 8 వరకు కోడ్ అమలు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో కూడిన పట్టభద్రుల, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఇందుకు సంబంధించి భారత ఎన్నికల సంఘము ఈనెల 3న నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటరు జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాలకు గుర్తించి గతేడాది డిసెంబర్ 30న తుది జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఈ జాబితాలో మండల వ్యాప్తంగా 566 ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 386, స్త్రీలు 180 ఉన్నట్టుగా అధికారులు పిడిఏప్ జాబితాను విడుదల చేశారు. ఇందుకు మార్చి 8వరకు కోడ్ అమలు చేయునట్లుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
షెడ్యూల్ ఇలా…
ఈనెల 3న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల కాగా అదే రోజు నుంచి 10 వరకు నామినేషన్ దాఖలాలకు అవకాశం కల్పించింది.11న నామినేషన్ పత్రాల పరిశీలన, 13న ఉపసంహరణ గడువు విధించింది.అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.ఈ నెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనుంది.