
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం, చలకుర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి గోవింద్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంఎల్ సీ మంకెన కోటిరెడ్డి చలకుర్తి లోని మృతిని నివాసంలో వారి పార్ధీవ దేహాన్ని సందర్శించి, పులా మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర మాజీ ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల పల్లి శేఖర్ రెడ్డి, జెజె సైదయ్య బాబు, బైకాని లక్ష్మయ్య యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.