శాగం కోటమ్మకు ఎమ్మెల్సీ నివాళి

నవతెలంగాణ -పెద్దవూర: నల్లగొండ జిల్ల నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలో, గ్రామ సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ మాతృమూర్తి శాగం కోటమ్మ దశ దిన కార్యక్రమానికి సోమవారం ఉమ్మడి జిల్లా ఎంఎల్ సి కోటిరెడ్డి హాజరై వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. శాగం కోటమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్సీతో పాటు మాజీ మండల అధ్యక్షులు బివి రమణ రాజు, మల్లయ్య యాదవ్, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .