
యాదగిరిగుట్ట మండలం మైలారిగూడెం గురువారం, గ్రామానికి చెందిన అనంతుల చెన్నారెడ్డి ఇటీవల మరణించినందున మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి మైలారిగూడెం గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతుల చెన్నారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైలారిగూడెం ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్ రెడ్డి, బండి ముత్యాలు, కాదూరి వెంకటేష్, గౌడ యాదగిరి, గుండ్లపల్లి శ్రీను, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.