ఎస్సీ వర్గీకరణ అమలుకు సుప్రీం కోర్టు ఆమోద ముద్ర వేసిన అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను శుక్రవారం, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఎమ్మార్పీఎస్ జాతీయ నేత మంద శంకర్ మాదిగ ఆధ్వర్యంలో నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదాద్రి లడ్డూ ప్రసాదం అందజేశారు. 30 ఏళ్ల పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బూడిద జాని మాదిగ, ఆకారపు లక్ష్మీనారాయణ మాదిగ, కొల్లూరి హరీష్ మాదిగ తదితరులు ఉన్నారు.