నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

నవతెలంగాణ -తాడ్వాయి
తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై బి ఓంకార్ యాదవ్ ను ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రసాద్ మాదిగ  జిల్లా, మండల ఎమ్మార్పీస్ నాయకులతో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్సై ఓంకార్ యాదవ్ గారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.  సమాజంలో జరుగుచున్న అన్యాయ అక్రమాలు, పోలీస్ శాఖ యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించారు. పోలీస్ శాఖ అండగా ఉండాలని ఆకాంక్షించారు. వారి వెంట ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా కన్వీనర్ పుల్లూరి కరుణాకర్, జిల్లా సీనియర్ నాయకులు గజ్జల రాజేందర్, పుల్లూరి లక్ష్మణ్, గజ్జల సంపత్, మంతెన సారంగపాణి, మండల కన్వీనర్ గజ్జల ప్రశాంత్ ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.