
నవతెలంగాణ- రెంజల్
రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గారి భూమయ్య స్పష్టం చేశారు. శుక్రవారం లంజల మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ వారిని అణగదొక్కడానికి ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కి గట్టి బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి, పింజెల్ మండల ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ లక్ష్మి గారి నరేష్, బాబురావు, శైలేష్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.