ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గ నిర్మాణం..

– గ్రామాధ్యక్షుడిగా తడ్కపల్లి రమేశ్ 
నవతెలంగాణ-బెజ్జంకి 
మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గ నిర్మాణం చేపట్టినట్టు సోమవారం మండల ఇంచార్జీ చింతకింది పర్శరాములు తెలిపారు. గ్రామాధ్యక్షుడిగా తడ్కపల్లి రమేశ్, ఉపాధ్యక్షులుగా కల్లేపల్లి శ్రీను, తడ్కపల్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా చిట్యాల సంపత్,కార్యదర్శులుగా బోయిని శ్రీనివాస్, తడ్కపల్లి సతీశ్, సహాయ కార్యదర్శిగా తడ్కపల్లి శ్రీపాల్, కార్యవర్గం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పర్శరాములు తెలిపారు. మండల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.