దళితునిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎమ్మార్పీఎస్

We strongly condemn attack on Dalit: MMRPS– న్యాయం జరిగేంత వరక పోరాటం తప్పదు
– ఎమ్మార్పీఎస్, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా ర్యాలీ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన బొమ్మేనా పెద్ద పెద్దన్న పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయం జరిగేంత వరకు పోరాటం తప్పదని నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సుధాకర్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం నుండి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వరకు నిజామాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్, రైతు పోలీస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేదా గ్రామం నివాసితుడైన బొమ్మేన పెద్ద పెద్దన్న అనే  రైతు మాదిగ కులానికి చెందిన వ్యక్తి పొలం కు వెళ్లే దారి విషయంలో గొడవకై గత కొన్ని సంవత్సరాలుగా ఇతని పొలం లోంచి రోడ్డు వేసి, రోడ్డు వెడల్పు చేసి ఇతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తే పట్టించుకోలేదు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నం 52/2023, 25.3.2023 నమోదు చేశారు. కానీ చార్జ్ షీట్ చేయకుండా వదిలేశారు. కొన్ని రోజుల క్రితం బొమ్మన పెద్దన్న పొలంలో ఉన్నటువంటి బోరు బావిలో 25.6.2024 రోజున రాళ్ళు వేసి,పంట వేయనియకుండ తనను మానసికంగా అతను ఇబ్బంది పడేలా చేశారు. దీని విషయమై పోలీసులను సంప్రదించినా కానీ జీరో ఎఫ్ ఐ ఆర్ చేసి వాళ్ళని మళ్లీ వదిలేశారు. ఇప్పుడు అవుల్దపురం సాయి రెడ్డి అనే వ్యక్తి ప్రోత్సాహంతో  నలుగురు కురుమ కులానికి చెందిన వ్యక్తులు బొమ్మెన పెద్దపెద్దన్న ను 05.7.2024 రోజున మధ్యాహ్నం 2:00 గంటలకు హత్య చేయడానికి ప్రయత్నించారు అని తెలియజేశారు.
దానిలో భాగంగానే బొమ్మన పెద్ద పెద్ద నకు పక్కటెముకలు 9 చోట్ల  & వెన్నుముక రెండు చోట్ల విరిగి చికిత్స పొందుతున్నాడు. పోలీసులకు కంప్లయింట్ చేయగా పోలీసులు,అటెం టు మర్డర్ కింద నలుగురి పై కేసు నమోదు చేశారు. కానీ ఈ హత్య యత్నానికి కారణమైన అవుల్ధపురం సాయా రెడ్డి పేరు చెపితే, అతని పేరు తీసుకోలేదు, దీంతో 07-07-2024 రోజున ఏసీపి విచారణ కొరకు  తల్వేధ గ్రామానికి రావడం జరిగింది, దీనికి కారణం సాయ రెడ్డి అని చెపితే, అతని పేరు చెప్పకు అని అందరి ముందు బెదిరించాడు. రికార్డు స్టేట్మెంట్ చేయగా అతని పేరు చెప్తే కట్ చేశారు. కావున ఈ దాడి కి కారణమైన ఆవుల్ధపురం సయారెడ్డి పై కేసు నమోదు చేయగలరని కోరుతున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కు ఘటనపై పూర్తిగా వివరించామన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ భర్తను హత్య చేయాలని చూసినా వారిని కఠినంగా శిక్షించాలని భార్య డిమాండ్ చేసింది. నిందితులను పట్టుకొని జైల్లో వేయాలని పోలీస్ కమిషనర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు, రైతు  సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.