తొలిమెట్టు శిక్షణను విజయవంతం చేయాలి : ఎంఎన్ఓ డాక్టర్ టి. రమేష్

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎన్ ఓ డాక్టర్ టి. రమేష్
సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎన్ ఓ డాక్టర్ టి. రమేష్
నవతెలంగాణ – ఐనవోలు
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల నందు తొలిమెట్టు శిక్షణ ప్లానింగ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ డాక్టర్ తాళ్లపల్లి రమేష్ పాల్గొని రిసోర్స్ పర్సన్స్ కు శిక్షణకు సంబంధించిన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే బుధవారం నుండి అనగా 2,3 తేదీలలో జరిగే ఎఫ్ఎల్ఎన్ శిక్షణకు పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయులు హాజరై, శిక్షణను విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాక శ్రీహర్షుడు మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులందరూ రెండు రోజులు జరిగే తెలుగు శిక్షణను వినియోగించుకోవాలని అలాగే 7, 8 తేదీలలో గణితం, 9, 10 తేదీలలో ఆంగ్లంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ చుంచుకాల లింగారావు, బాలోజు బ్రహ్మచారి, అశోక్ వర్ధన్ రెడ్డి, వేణుగోపాల స్వామి, సిహెచ్ శ్రీనివాస్, బి.స్వప్న,   సీఆర్పి రేవతి  తదితరులు పాల్గొన్నారు.